సాలూరు: సభ్యత్వ నమోదు వేగవంతం చేయండి: మంత్రి సంధ్యారాణి

78చూసినవారు
సాలూరు: సభ్యత్వ నమోదు వేగవంతం చేయండి: మంత్రి సంధ్యారాణి
టిడిపి సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని పొలిట్ బ్యూరో సభ్యురాలు, మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం సాలూరు మంత్రి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ టిడిపి క్లస్టర్, బూత్, యూనిట్ ఇన్ ఛార్జ్ లతో ఆమె సమావేశమయ్యారు. నియోజకవర్గంలో 50వేల సభ్యత్వ నమోదు చేయాలని అధిష్టానం లక్ష్యం విధించింది. నెల రోజుల పాటు జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

సంబంధిత పోస్ట్