సాలూరు పర్యటనకు వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను జనసైనికులు ఘనంగా స్వాగతం పలికారు. శుక్రవారం
రామభద్రపురం మీదుగా పవన్ కళ్యాణ్ సాలూరు వెళ్లడంతో బైపాస్ రోడ్డు గాంధీ విగ్రహం జంక్షన్ వద్దకు జనసేన నాయకులు, కార్య కర్తలు, అభిమానులు తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ కారు నుంచి బయటకు వచ్చి జనసైనికులకు అభివాదం చేశారు. దీంతో జనసైనికులు, అభిమానులు కేరింతలు కొట్టారు.డిప్యూటీ సీఎం సాలూరు చేరుకున్నారు.