ఎస్. కోట నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని ఆదివారం ఎస్ కోటలో నిరసన వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల నుండి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న తమకు ప్రభుత్వం ఉద్యోగ భద్రతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి దేవి కూడలి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.