గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ సమాన భావంతో మెలగాలి

58చూసినవారు
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ సమాన భావంతో మెలగాలి
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ సమాన భావంతో మెలగాలని కొత్తవలస తాసిల్దార్ నీలకంఠ రావు కోరారు. సివిల్ రైట్స్ డే సందర్భంగా సోమవారం ఆయన స్థానిక సర్పంచ్ రామస్వామి తో కలిసి సంత మార్కెట్ సమీపంలో గల హరిజన కాలనీలో మానవ హక్కుల పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో కుల, జాతి వివక్షత విడనాడాలని పిలుపునిచ్చారు. ప్రజలతో మమేకమై మానవ హక్కులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్