లక్కవరపుకోట: నట్టల నివారణ మందులు పంపిణీ కార్యక్రమం

75చూసినవారు
లక్కవరపుకోట: నట్టల నివారణ మందులు పంపిణీ కార్యక్రమం
ఎల్ కోట మండలం కితన్నపేట, రంగరాయపురంలో సోమవారం పశుసంవర్ధక శాఖ అధికారులు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. నట్టల నివారణకు సంబంధించి మందులు ద్వారా జీవాలకు వ్యాధి నిరోధక శక్తి పెంపొందింపబడుతుందని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ గాయత్రి తెలిపారు. ఈ మేరకు 150 గొర్రెలకు, 250 మేకలకు ఈ మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పశుసంవర్ధక సహాయకులు రఘు, రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్