ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వం నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా శుక్రవారం ఎస్ కోటలో దేవి గుడి నుండి విద్యుత్ కార్యాలయం వరకు వైసిపి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఈ కి వినతిపత్రం అందజేశారు.