కొత్తవలస స్థానిక జడ్పీ హైస్కూల్ ను ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించి, వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. మధ్యాహ్న భోజనంలో మెనూ సక్రమంగా అమలు చేయాలని సిబ్బందికి సూచించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే తనకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఎంపీటీసీ బాబీ తదితర పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.