ఎస్ కోట పంచాయతీ పరిధిలో గల సీతంపేటలో ఆదివారం శ్రీ సింహాద్రి అప్పన్న రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారి పల్లకి ఊరేగింపు, రథోత్సవాన్ని సింహాచలం శ్రీ చందన పెరుమాల్ పీఠం వ్యవస్థాపకులు సాన బోయిన రాజు, గొర్రుపోటు శ్రీను స్వామి ఆధ్వర్యంలో స్వామివారి రథాన్ని గ్రామ పురవీధుల్లో కోలాట నృత్యాలు నడుమ ఊరేగించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.