శృంగవరపుకోట: గిరిజనుల సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి

85చూసినవారు
శృంగవరపుకోట: గిరిజనుల సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి
ఎస్. కోట మండలం దారపర్తి పంచాయతీలో గిరిజనుల సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వబ్బిన సన్యాసినాయుడు ఆధ్వర్యంలో గిరిజనులు స్థానిక ఎంపీడీవో, డిప్యూటీ తాసిల్దార్ కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సత్వరమే అధికారులు సర్వే చేపట్టి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2005లో కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు అటవీ భూముల హక్కుల చట్టం చేసినప్పటికీ గిరిజనులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్