విజయనగరం: 117 కేజీల గంజాయి స్వాధీనం

63చూసినవారు
అరకు నుండి కేరళకు బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను శృంగవరపుకోట పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బొలెరో వాహనంలో తరలిస్తున్న 117 కేజీల గంజాయి, రెండు ఫోన్లు, రూ. 10, 310 ల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 5 లక్షల 80 వేలు ఉంటుందన్నారు. గంజాయి రవాణా చేసిన అమ్మిన కఠిన చర్యలు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్