నిరుద్యోగ యువతకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వారిలో నైపుణ్యాన్ని వృద్దిచేసి, తద్వారా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని, జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధించేందుకు యువత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థలో బుధవారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు అపూర్వ స్పందన లభించింది.