వైసీపీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. 2004 నుంచి జగన్ వెంట నడిచిన ఆయన.. అక్రమాస్తుల కేసులో జగన్‌తో పాటు జైలు జీవితం అనుభవించారు. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు నడిపారు. రేపు విజయసాయిరెడ్డి రాజీనామా చేయనుండటంతో జగన్ ఒంటరవుతారని వైసీపీ శ్రేణులు ట్వీట్ చేస్తున్నారు. వైసీపీ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.