ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. 2024 ఎన్నికల సమయంలో వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు ముగ్గురు వైసీపీ ఎంపీలు రాజీనామా చేయగా.. తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం ఏడుకు తగ్గింది. ఇప్పటికే ఆర్.కృష్ణయ్య, మోపిదేవి, బీద మస్తాన్‌రావు రాజ్యసభ పదవులు వదులుకున్నారు.