వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా ఆ పార్టీకి రాజీనామ చేశారు. అలాగే రేపు రాజ్యాసభ సభ్యత్వానికి కూడా రాజీనామ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని, వేరే పార్టీలో చేరే అవకాశం లేదని అన్నారు. అలాగే టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని తెలిపారు. ఈ నిర్ణయంలో ఎవరి ఒత్తిడి లేదన్నారు.