HYDలోని కొండాపూర్‌లో రూ.200 కోట్ల విలువైన 2.08 ఎకరాల భూమిపై వివాదం నెలకొంది. తమ భూమిని రాజకీయ పలుకుబడి ఉన్న ఎ.అనిల్ రెడ్డి కబ్జా చేశారని, తమపై దాడి చేశారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలతారెడ్డి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, భూమి తమదేనని, వైవీ, ఆయన భార్య కబ్జాకు యత్నించారని నర్సింహారెడ్డి తరపున ఆయన వాచ్‌మెన్ ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.