AP: పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. జీతాలు లేకపోతే పండుగ ఎలా చేసుకోవాలంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు. కార్మికులను సాగనంపేందుకు యాజమాన్యం కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. వీఆర్ఎస్ పథకం అమలుకు ఆర్ఐఎన్ఎల్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ద్వారా 2025 మార్చిలోపు వెయ్యి మందిని బయటకు పంపేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు సమాచారం.