డాక్ యార్డ్ ఉద్యోగులకు అండగా ఉంటాం

64చూసినవారు
డాక్ యార్డ్ ఉద్యోగులకు అండగా ఉంటాం
విశాఖలో నేవెల్ డాక్ యార్డ్ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎమ్మెల్యేలను వారి వారి స్వగృహాలలో శనివారం సత్కరించారు. ఉద్యోగులు సొంతంగా సామాజిక భవనం నిర్మించుకోవడం అభినందనీయం అని ఎమ్మెల్యేలు అన్నారు.

సంబంధిత పోస్ట్