మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
By ఆర్ కిరణ్ కుమార్ 56చూసినవారువిశాఖ నడిబొడ్డున్న ఉన్న మెడికవర్ ఆస్పత్రిలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి యాజమాన్యం సత్వరం స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆస్పత్రి సెల్లార్లో యుపిఎస్ బ్యాటరీలలో కాలిపోయిన దట్టంగా పొగలు వ్యాపించాయి. దీంతో మంటలు వ్యాపించాయి. సెక్యూర్టీ సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి తెలియజేడంతో వారొచ్చి మంటలను అదుపు చేశారు.