విశాఖ బక్కన్నపాలెంలోని ఏపీఎస్పీ 16వ పోలీస్ బెటాలియన్ నూతన కమాండెంట్‌గా కె. వి. మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. బెటాలియన్ ఇన్‌చార్జి కమాండెంట్‌గా ఉన్న పద్మనాభరాజు ఆయనకు స్వాగతం పలికి బాధ్యతలు అప్పగించారు.
మురళీకృష్ణ అనంతపురం ఎస్పీగా పనిచేస్తూ ఇక్కడకు బదిలీపై వచ్చారు. అంతకుముందు ఆయన అనకాపల్లి ఎస్పీగా కూడా పనిచేశారు. బాధ్యతల స్వీకరించిన అనంతరం బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్ కార్యాలయాలు సందర్శించారు.