స్వచ్చతా హి సేవలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, నివాసిత సంక్షేమ సంఘాలు భాగస్వామ్యం కావాలని విశాఖ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి పేర్కొన్నారు. బుధవారం ఆర్. కె. బీచ్ సమీపంలో స్వచ్చ భారత్ మిషన్ ఆదేశాల మేరకు జివిఎంసి, ఎ. పి. టూరిజం సంయుక్తంగా నిర్వహించిన స్వచ్చతా హి సేవ 2024 కార్యక్రమంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జివిఎంసి కమీషనర్ సంపత్ కుమార్ లతో కలసి పాల్గొన్నారు.