విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలోని దువ్వాడ పోలీస్ స్టేషన్ సిఐగా మల్లేశ్వరరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం కచ్చితంగా అమలు చేస్తానన్నారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన మల్లేశ్వరరావును సిబ్బంది అభినందించారు.