శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సందర్భాన్ని పురస్కరించుకొని సింహాచలం అప్పన్న బాబు ఆలయంలో ఉచిత సామూహిక వ్రతాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తున్నారు. పూజా సామాగ్రి అంతా దేవస్థానమే సమకూర్చింది. అంతేకాకుండా వ్రతం చేయించుకునేందుకు వచ్చేవారిని కొండ కింద నుంచి ఆలయానికి వెళ్లేందుకు ఉచిత బస్సు సౌకర్యాన్ని దేవస్థానం కల్పించింది.