అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముందస్తు ప్రసవాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళనకరంగా ఉందని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. విశాఖ కేజీహెచ్ లోని ఎస్టీ సెల్ లో సంబంధిత వార్డులలో బుధవారం ఆమె తనిఖీలు నిర్వహించారు. నెలలు నిండకముందే ప్రసవాలు కావడం ఒక రకంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను తమ గిరిజనులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.