ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా విధి నిర్వహణ చేస్తున్న జర్నలిస్టుల సేవలు సమాజానికి అవసరమని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం జర్నలిస్ట్ డే సందర్భంగా నగరంలో పని చేస్తున్న పలువురు జర్నలిస్టులను విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు డాక్టర్ కందుల నాగరాజు ఘనంగా సన్మానించారు.