4, 972 మంది డ్రైవింగ్ లైసెన్సులు తాత్కాలికంగా రద్దు

56చూసినవారు
4, 972 మంది డ్రైవింగ్ లైసెన్సులు తాత్కాలికంగా రద్దు
ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రాజారత్నం సూచించారు. విశాఖలోని గోపాలపట్నంలో గురువారం ఆయన మాట్లాడుతూ హెల్మెట్లు ధరించకుండా ప్రయాణిస్తున్న 4, 972 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను మూడు నెలలపాటు తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 2 నుంచి 11 వరకు జరిగిన స్పెషల్ డ్రైవ్‌లో 5, 543 మందిపై కేసులు నమోదు చేసామన్నారు.

సంబంధిత పోస్ట్