ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పోలీసు కవాతు

65చూసినవారు
ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పోలీసు కవాతు
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బుచ్చయ్యపేట మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం పోలీసు కవాతు ఘనంగా జరిగింది. కొత్తకోట సిఐ. ఎల్. అప్పలనాయుడు, స్థానిక ఎస్సై డి. ఈశ్వరరావు ల ఆధ్వర్యంలో కేంద్ర పోలీస్ బలగాలు సీతయ్యపేట, పెదపూడి, పంగిడి, గొర్లిపాలెం, గున్నేంపూడి, పెదమదీనా తదితర గ్రామాల్లో తిరిగి ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించుటకు ప్రజలు సహకరించాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్