ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి

1893చూసినవారు
చోడవరం మండలంలోని రేవల్లు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కె. కోటపాడు కు చెందిన వేచలపు గోవిందరావు, అతని భార్య వెంకటలక్ష్మి(52) చోడవరంలో కోర్టులో పనులు ముగించుకొని స్కూటీపై వెళ్తుండగా రేవళ్ల వద్ద ఎదురుగా రాయిలోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భర్త గోవిందురావు సురక్షితంగా బయటపడ్డారు. దీనిపై చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్