'అవినీతి అంతమే సిసిఆర్ లక్ష్యం'

180చూసినవారు
'అవినీతి అంతమే సిసిఆర్ లక్ష్యం'
కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ అనే పౌర మానవ హక్కుల సంస్థ జాతీయ సదస్సు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాల నుండి అనేకమంది సమాచార కార్యకర్తలు హాజరయ్యారు. ముఖ్యంగా ఏపీ నుండి అన్ని జిల్లాలు నుంచి అత్యధికులు యువత, ఉద్యోగులు పాల్గొన్నారు. కౌన్సిల్ ఫర్ సిటిజన్ సంస్థ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు మంచికట్ల అనిల్ కుమార్* మాట్లాడుతూ సమాజంలో మార్పు తీసుకు రావాలంటే ముందుగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భాద్యతలు గుర్తు ఎరగాలని, సమాచార హక్కు చట్టం గురించి ప్రజలలో చైతన్యం తీసుకురావాలని, అవినీతి అంతమే మా సిసిఆర్ లక్ష్యంగా పని చేస్తుందని అన్నారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బుఖ్య శంకర్(టీఎస్ బార్ కౌన్సిల్ మెంబర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులు తనిఖీ చేసే హక్కు సామాన్య ప్రజలకు ఉందని, సమాచార హక్కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి తప్పకుండా సమాచారం ఇవ్వాలని, లేని పక్షంలో సమాచార కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటాదని, చట్టాన్ని అడ్డుపెట్టుకుని తప్పులు చేస్తున్న కొందరి వల్ల చట్టం నమ్మకం పోతుందని అన్నారు. దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులు తనిఖీలు చేసిన మొట్టమొదటి సంస్థ సిసిఆర్ అని అభినందించారు.

అలాగే అతిధులుగా తెలంగాణ పోలీస్ అకాడమీ ఫ్యాకల్టీ డా. రజిత, ఏ గంగాధర్, చెగ్గం వేణు, వైద్య అనిల్, ముత్యాల అశోక్, భావన రిషి చేతులు మీదగా విశేష కృషి చేసిన సభ్యులకు అవార్డులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏపీ సిసిఆర్ రాష్ట్ర కార్యదర్శి డా. లక్మి ప్రశాంత్, బత్తిన శ్రీనివాసరావు, విశాఖ జిల్లా ప్రెస్ అండ్ మీడియా ఇంఛార్జి కసిపల్లి శ్రీనివాసరావు, జిల్లా కన్వీనర్ చల్లా చంద్రశేఖర్, రాయలసీమ కన్వీనర్ మహేష్ తదితర సభ్యులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్