నర్సీపట్నం చేరుకున్న అయ్యన్నపాత్రుడుకి టిడిపి కార్యకర్తలు నాయకులు అభిమానులు మేళతాళాలతో స్వాగతం పలికి పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. విశాఖ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నర్సీపట్నం చేరుకున్న అయ్యన్నపాత్రుడు ఆయన తనయుడు రాజేష్ కు కనివిని ఎరుగని రీతిలో స్వాగతం లభించింది. నర్సీపట్నం మున్సిపాలిటీ బొడ్డేపల్లి జంక్షన్ నుంచి శ్రీ కన్య థియేటర్ మీదుగా అయ్యన్నను ఇంటివరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం హైకోర్టులో వేసిన కేసు తీర్పు వచ్చిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తానన్నారు.