నర్సీపట్నం మున్సిపాలిటీ 9వ వార్డులో జరుగుతున్న సిసి రోడ్ల నిర్మాణాలను ఆ వార్డు జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య సోమవారం పరిశీలించారు. ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన ఈ రోడ్ల నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సౌజన్య రోడ్డు నిర్మాణాలను పరిశీలించడంతో పాటు రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్ ఉన్నారు.