నర్సీపట్నంలో అక్రమ కట్టడాలు కూల్చివేత
నర్సీపట్నం మున్సిపాలిటీ వెలమవీధి పోలీస్ స్టేషన్ పక్క రోడ్లో అక్రమ భవనం కూల్చివేతను భారీ పోలీసు బందోబస్తు మధ్య తహశీల్దార్ రామారావు, సిఐ గోవిందరావు సమక్షంలో సోమవారం ఉదయం చేపట్టారు. చిటికెల కన్నా అనే వ్యక్తికి సంబంధించిన భవనం అనుమతులు లేకుండా నిర్మించారని మున్సిపల్ అధికారులు తెలిపారు. గతంలో ప్రయత్నం చేసినప్పటికీ బాధితుడు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నాడు. స్టే గడువు ముగియడంతో కూల్చి వేతకు శ్రీకారం చుట్టారు.