డ్రైనేజీ లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

470చూసినవారు
డ్రైనేజీ లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం మేజర్ పంచాయతీ గోకులపాడు గ్రామంలో గోకులపాడు మీదుగా భీమవరం దార్లపూడి ఏటికొప్పాక షుగర్ఫ్యాక్టరీ వెళ్లే రహదారికి ఇరువైపులా డ్రైనేజీలు లేక రోడ్డు మీద నుంచి నీరు పారడంతో అటుగా వెళ్ళే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా మట్టి ఉండడంతో అది బురద గా మారి ద్విచక్ర వాహనం జారి పడుతున్నాయని వాపోతున్నారు. శాశ్వత పరిష్కారం లేనప్పటికీ కనీసం తాత్కాలికంగా పరిష్కారం కూడా చేయట్లేదు అని అక్కడ కొంతమంది యువకులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్