అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం మేజర్ పంచాయతీ శివరా గోకులపాడు గ్రామంలో స్కూలుకి వెళ్లాలంటే ప్రతి విద్యార్థి భయపడుతూనే వెళ్లాలి భయపడుతూనే రావాలి. అటువైపుగా వెళ్తున్న చిన్నారుల తల్లిదండ్రులు భయానికి గురవుతున్నారు. మాకు కొత్త బ్రిడ్జి ఏమీ కట్టనవసరం లేదు కనీసం బ్రిడ్జి పైన ఉన్న గోడల నిర్మించండి అని గత నాలుగు సంవత్సరాలుగా చెబుతున్న పట్టించుకోని నాయకులు అధికారులు వచ్చేది వర్షాకాలం ఈ పంట కాలవ ఉదృత పెరిగే అవకాశం ఉంది గోడల లేక అటువైపు వెళుతున్న చిన్నారులు, వృద్ధులు భయపడుతూనే వెళ్ళవలసి వస్తుంది. కావున ఇప్పటికైనా స్పందించి మా సమస్యని పరిష్కరిస్తారని అధికారులను నాయకులను వేడుకుంటున్న యువత మరియు గ్రామస్తులు.