ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)గా ఐఏఎస్ వివేక్ యాదవ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్థానంలో వివేక్ యాదవ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సీఈవోగా వివేక్ యాదవ్ ఛార్జ్ తీసుకోగానే సీఈవో బాధ్యతల నుంచి ఎంకే మీనా రిలీవ్ కానున్నారు. ఎంకే మీనాకు చంద్రబాబు ప్రభుత్వంలో కీలక శాఖ అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.