అనకాపల్లి: సమస్యల పరిష్కారానికి 21న విజయవాడలో ధర్నా

78చూసినవారు
అనకాపల్లి: సమస్యల పరిష్కారానికి 21న విజయవాడలో ధర్నా
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం ఎలమంచిలిలో విజ్ఞప్తి చేశారు. రావలసిన పెండింగ్ బకాయిలతో పాటు సమస్యలను అధికారులకు ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్