జీవీఎంసీ 85 వార్డు కొండయ్యవలస గ్రామ దేవత మరిడిమాంబ ఆలయం వద్ద వేసవికాలమును దృష్టిలో ఉంచుకొని బాటసారిలకు నీటి ఎద్దడి లేకుండా వారి సౌకర్యార్థం అగనంపూడి సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో చలివేంద్రంను ఏర్పాటు చేయడం జరుగుతుందని, గురువారం ఈ చలివేంద్రాన్ని అనకాపల్లి దిశా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి లక్ష్మి సందర్శించి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు ఎండతాపమును తగ్గించే విధముగా చల్లని మజ్జిగను ప్రజలకు అందిస్తూ ఎంతో సహృదయం తో సత్యసాయిబాబా ప్రతినిధులు గత 20 సంవత్సరాలు నుండి అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చలివేంద్రం నడపడం తాను గమనించానని, అదే సేవ దృక్పథంతో నేడు మరిడి మాంబ ఆలయం వద్ద మరొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం వారికి ప్రజల పట్ల గల సేవా భావాన్ని తెలియజేస్తుందని, ప్రజా శ్రేయస్సు కొరకు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న శ్రీ సత్య సాయి భక్తులు ఎంతైనా అభినందనీయులని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, మరిడిమాంబ ఆలయ కమిటీ అధ్యక్షులు బలిరెడ్డి శ్రీను, ఆలయ కార్యనిర్వాహక అధ్యక్షులు పిల్లా రవి ప్రసాద్, పరిసర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.