అనంతగిరి: చిలకలగెడ్డ గ్రామ పంచాయతీ ఆర్బికే రైతుభరోసా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు శనివారం స్థానిక సర్పంచ్ మజ్జి అప్పారావు, హార్టికల్చర్ అసిస్టెంట్ పొద్దు రాంబాబు ఆధ్వర్యంలో రైతులకు వరివిత్తనాలు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ 15 గ్రామాలకు సంబంధించి రైతులకు 70 బస్తాలు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆధార్ కార్డు, పట్టా తీసుకొని వచ్చి నమోదు చేసుకొని 90 శాతం సబ్సిడీ ద్వారా విత్తనాలు పొందాలని తెలిపారు.