![దానిరంగనిలో తాగునీటి సమస్య పరిష్కరించాలి దానిరంగనిలో తాగునీటి సమస్య పరిష్కరించాలి](https://media.getlokalapp.com/cache/c9/f3/c9f3cb539625808e1c3d5ae38e6f4879.webp)
దానిరంగనిలో తాగునీటి సమస్య పరిష్కరించాలి
అరకులోయ మండలంలోని మాడగడ పంచాయతీ పరిధి దానిరంగనిలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు గురువారం తెలియజేశారు. గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొళాయిల్లో మంచినీటి రాకపోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ సమీపంలోని పంట పొలాల ఊట కుంటల కలుషిత నీటిని ఉపయోగించుకుని రోగాల భారీ పడుతున్నామని గిరిజనులు వాపోతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించాలని గిరిజనులు హద్దు తదితరులు కోరారు.