గంజాయి సమాచార‌మిస్తే రివార్డు ఇస్తాం: మంత్రి అనిత

55చూసినవారు
AP: గంజాయికి సంబంధించి పోలీసులకు స‌మాచారం ఇచ్చిన వారికి న‌గ‌దు రివార్డు ఇస్తామ‌ని హోం మంత్రి అనిత వెల్ల‌డించారు. వారం రోజుల్లో టోల్ ఫ్రీ నంబ‌ర్ ఇస్తామ‌ని.. ఆ నంబ‌ర్‌కు ఫోన్ చేసి గంజాయిపై సమాచారం ఇవ్వొచ్చ‌ని తెలిపారు. స‌మాచారం ఇచ్చిన వారి వివ‌రాల‌ను బ‌హిర్గతం చేయ్య‌మ‌ని, గోప్యంగా ఉంచుతామ‌ని పేర్కొన్నారు. విశాఖను గంజాయికి రాజధానిని చేశారని, 3 నెలల్లో అక్కడ గంజాయి లేకుండా చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్