Jan 18, 2025, 16:01 IST/మేడ్చల్
మేడ్చల్
చెత్తలారీ దగ్ధం – డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం...
Jan 18, 2025, 16:01 IST
శనివారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో డంపింగ్ యార్డు వెళ్తున్న టీఎస్ 08 యూహెచ్ 7936 నంబర్ గల చెత్తలారీకి షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన లారీ డ్రైవర్ సతీష్, చాకచక్యంతో లారీని పక్కకు నిలిపి ప్రాణాపాయాన్ని తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కీసర పోలీసులు అటుగా వెళ్తున్న ప్రజలను అప్రమత్తం చేశారు.