తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడిగా సెవెళ్ల మహేందర్ బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి శనివారం ఆయనను అభినందించారు. పార్టీ పటిష్టత కోసం నిరంతరం కృషి చేస్తున్న యువమోర్చా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా రాష్ట్ర నాయకులు మహేష్. చిత్రంజన్ వినీత్, అరవింద్, యోగి, ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.