ఉగాది పండుగ సందర్భంగా గద్దర్ అవార్డులు (సినిమా) ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సెక్రటేరియట్ లో గద్దర్ అవార్డుల కమిటీతో శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించి మాట్లాడారు. సినీ ఇండస్ట్రీ వాళ్లు అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తామని చెప్పారు. మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తామన్నారు.