అనంతగిరి మండలంలోని పలు గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. పినకోట పంచాయతీలోని చిందుగులపాడుకి చెందిన బాలింత సునీత 4నెలల క్రితం బిడ్డకు జన్మనివ్వగా బిడ్డ మృతి చెందింది. సునీత 4 నెలలుగా రక్తహీనతతో బాధపడుతుంది. దీంతో గ్రామానికి రహదారి సౌకర్యం లేక అంబులెన్స్ రాక కుటుంబీకులు సునీతను డోలిలో చిందుగులపాడు నుంచి బల్లిపురం వరకు 3 కి. మీ. మోసుకొచ్చి 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారు.