అరకులోయ మండలంలోని దేవరపల్లి తదితర గ్రామాల్లో వ్యాధుల నివారణకు వైద్యశిబిరం నిర్వహించేందుకు మాడగడ ఆస్పత్రి నుంచి వెళ్తున్న అంబులెన్స్ ధనరంగని వద్ద బురదలో మంగళవారం కూరుకుపోయింది. అంబులెన్స్ డ్రైవర్ శ్రమించి బురదలో కోరుకుపోయిన అంబులెన్స్ను ముందుకు నడపడంతో అంబులెన్స్లో సిబ్బందికి ప్రమాదం తప్పింది. ఇటీవల రోడ్డు నిర్మాణం కొరకు మట్టిని తవ్వి వదిలేయడంతో వర్షాలకు రహదారి బురదమయమైందని స్థానికులు తెలిపారు.