అరకులోయ మండల పరిసర ప్రాంతంలో సోమవారం తెల్లవారుజాము నుంచి 11 గంటల వరకు దట్టంగా పొగ మంచు కమ్మేసింది. నాలుగు రోజుల తుఫాన్ తర్వాత ఇల్లు, చెట్టు, రోడ్లు ఎదురుగా వచ్చే మనుషులు వాహనాలు కనిపించలేనంతగా మంచు కురిసింది. దీంతో వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చలి తీవ్రత కొనసాగుతునే ఉంది.