బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అరకులోయ మండలంలోని మూడు రోజులుగా పొగ మంచుతో కూడిన చిరుజల్లులతోపాటు తేలికపాటి వర్షం కురుస్తోంది. దీనితో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటూ హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు కొనసాగిస్తున్నారు. అయితే కురుస్తున్న వర్షం కారణంగా బుధవారం ఆయా గ్రామాల్లో జరగనున్న క్రిస్మస్ సందడికి పట్టణ ప్రాంతాల నుంచి ఆయా గ్రామాలకు క్రైస్తవ భక్తులు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.