గిరిజనుల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జీవో నెం-3 రిజర్వేషన్లపై తాము జారీ చేసిన మెమోను వెంటనే ఉపసంహరిస్తూ టిఏసిలో తీర్మానం చేయాలని ఆదివాసి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి రామన్నదొర డిమాండ్ చేశారు. ఆదివారం రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసులకు ప్రత్యేక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 100% ఉద్యోగ అవకాశాలు ఆదివాసులకు కల్పించాలని డిమాండ్ చేశారు.