దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరూ దోమ తెరలు వాడాలని అరకులోయ మలేరియా సబ్ యూనిట్ అధికారి అప్పలస్వామి అన్నారు. మంగళవారం అరకులోయ మండలంలోని గన్నెల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వద్ద మలేరియా వ్యాధిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల పరిసరాల పరిశుభ్రత లేకపోవడంతో దోమలు చేరుతాయన్నారు. దోమలు కుట్టడం వలన డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వస్తాయని ప్రతి ఒక్కరూ దోమ తెరలు వాడాలని కోరారు.