పాడేరు పరిసర ప్రాంతంలో భారీ వర్షం

565చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అల్లూరి జిల్లా పాడేరు పరిసర ప్రాంతంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటపాటు కురిసిన భారీ వర్షంతో రహదారులన్ని జలమయమయ్యాయి. దీనితో వాహనచోదకులు ప్రయాణికులు పాద చారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కురిసిన భారీ వర్షంతో తొలకరి పంటలు విత్తుటకు ఎంతో అనుకూలమని పలు గ్రామాల గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్