పెదబయలు మండలంలోని గోమంగి గ్రామంలో సంక్రాంతి కనుమ వేడుకలను గిరిజనులు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు, సంక్రాంతి పర్వదినంగా ఇంటిముందు రంగవల్లులు వేయడంతో మొదలైన వేడుకలు బుధవారం కనుమ పండుగ రోజున గోపూజలతో ముగిశాయి. ఉపవాసం ఉన్న కొందరు తమ ఆరాధ్య దైవానికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం బుధవారం రాత్రి గ్రామ గిరిజనులంతా కలిసి ఆనందోత్సాహాల మధ్య థింసా నృత్యం చేస్తూ సందడి చేస్తున్నారు.